
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని రోడ్ల వెంట వర్షపునీరు నిల్వకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్,హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సిటీలోని మంచిర్యాలచౌరస్తా, జగిత్యాల రోడ్డు, రాంనగర్ ఏరియాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజివాకడేతో కలిసి పరిశీలించారు.
మున్సిపల్, ఆర్అండ్‌బీ, ఇంజినీరింగ్ ఆఫీసర్లు సమన్వయంతో ముంపు ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజీల నిర్మాణం, వరద నీరు త్వరగా వెళ్లేందుకు అసంపూర్తిగా ఉన్న నాలాలు, కల్వర్టులను పూర్తి చేయాలని సూచించారు.
ఎరువుల దుకాణం, పీహెచ్‌సీ తనిఖీ
గంగాధర, వెలుగు: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పెషల్ఆఫీసర్సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. గంగాధర మండలం మధురానగర్‌లోని ఎరువుల దుకాణం, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల కొనుగోలు రిజిస్టర్, నిల్వలను పరిశీలించారు. రోజువారీ అమ్మకాలు, గతేడాది ఈ సమయానికి మండలంలో జరిగిన మొత్తం అమ్మకాల వివరాలను వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలో ఓపీ, ఐపీ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఇంటింటి ఆరోగ్య సర్వే పూర్తి చేయాలని, గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటుచేసి విస్తృతంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గతేడాది ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో మహేశ్వర్, డీఏవో భాగ్యలక్ష్మి, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, ఏడీఏ ప్రియదర్శిని, డీఎంహెచ్‌వో వెంకటరమణ, తహసీల్దార్ అనుపమరావు, ఎంపీడీవో రాము ఉన్నారు.
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పీహెచ్‌సీని స్పెషల్ఆఫీసర్తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని 24 జీపీల్లో ఫాగింగ్ మిషన్స్, కెమికల్స్ అందుబాటులో ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ సర్వే ద్వారా 40 కేసులు గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, పీడీ లత, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీవో స్వరూప, డాక్టర్లు నరేశ్, లావణ్య పాల్గొన్నారు.