
కరీంనగర్ క్రైం, వెలుగు: కమిషనరేట్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసిన పోలీసు అధికారులు గురువారం రిటైర్‌మెంట్ తీసుకున్నారు. కరీంనగర్ సీసీఎస్ పీఎస్ ఎస్సై రాజేందర్, జమ్మికుంట ఏఎస్సై వెంకటేశ్వర్లు, ఎల్ఎండీ ఏఎస్సై దామోదర్ రావు, రూరల్ ఏఎస్సెలు గోపాల్ రెడ్డి, చంద్రమౌళి, ఇల్లందకుంట ఏఎస్సై మల్లయ్య, ఏఆర్ ఎస్సై మహేందర్ రెడ్డి గురువారం రిటైర్‌మెంట్ తీసుకోగా.. సీపీ గౌస్ ఆలం వారిని సన్మానించారు. జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్‌ఐ శ్రీధర్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి సురేందర్ పాల్గొన్నారు.
ఉద్యోగంలో పదవీ విరమణ సర్వసాధారణమే
వేములవాడ, వెలుగు:- ప్రభుత్వ- ఉద్యోగంలో పదవీ విరమణలు సాధారణమేనని రాజన్న ఆలయ ఇన్‌చార్జి ఈఓ రాధాబాయి అన్నారు. గురువారం రాజన్న ఆలయ సహాయక ఇంజనీర్ ఆర్. లక్ష్మణ్ రావు, జి. లక్ష్మణ్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఈవో వారిని సన్మానించారు. ఆలయ యూనియన్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ఆలయ అధికారులు
తెలిపారు.