కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 స్కూల్‌‌‌‌ బస్సులు, 50 ఆటోలు సీజ్

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 స్కూల్‌‌‌‌ బస్సులు, 50 ఆటోలు సీజ్

కరీంనగర్ క్రైం, వెలుగు: ​కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్‌‌‌‌ బస్సులు, ఆటోలపై పోలీసులు, ఆర్టీఏ ఆఫీసర్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలు చేపట్టి ఫిట్‌‌‌‌నెస్ లేని 17 స్కూల్ బస్సులు, 50 ఆటోలను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని 64 వాహనాలపై, యూనిఫాం ధరించని 13 మంది డ్రైవర్లపై, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఓవర్‌‌‌‌లోడ్‌‌‌‌తో నడుపుతున్న 9 వాహనాలపై చర్యలు తీసుకున్నారు. 

మొత్తంగా 87 వాహనాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు, మోటారు వాహన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ స్కూల్ బస్సుల డ్రైవర్లు నిబంధనలను పాటించాలన్నారు. తనిఖీల్లో ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, మోటార్ వెహికల్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ జి.కవిత, ట్రాఫిక్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ అంజయ్య, అధికారులు పాల్గొన్నారు.