
కరీంనగర్ జిల్లాలో అఘోరాలు కలకలం సృష్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల టైంలో జిల్లాల్లో తిరిగిన అఘోరాలు.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రించిన రుద్రాక్షలు ఇచ్చి.. ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ వచ్చి సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులను కలుసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు రాకుండా, ఐదేళ్ల పదవీకాలం సజావుగా సాగేందుకు ప్రత్యేక పూజలు చేస్తామంటూ నమ్మిస్తున్నారు. అయితే వీళ్లు నిజంగా అఘోరాలా.. లేదంటే.. ఆ ముసుగులో డబ్బులు వసూలు చేసే దొంగ బాబాలా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.