ప్రతిపక్షాలకు కరీంనగర్లో అభివృద్ధి కనిపించదా? : సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

ప్రతిపక్షాలకు కరీంనగర్లో అభివృద్ధి కనిపించదా? : సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి
  •     సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. మంగళవారం రేకుర్తిలో రూ.10 లక్షలతో యుజీడీ పైప్‌‌‌‌లైన్, శాషామహల్‌‌‌‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు కనిపిస్తలేదన్నారు. 

కార్యక్రమంలో నాయకులు ఎండీ తాజ్, లయక్ ఖాద్రి, అబ్దుల్ రహమాన్, నిహాల్ అహ్మద్, అస్తపురం రమేశ్‌‌‌‌, తిరుమల, వెన్నం రజితారెడ్డి, మల్లేశం, గంగిపెల్లి సంపత్, లత, కనకలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.