అప్పుకు అరుదైన నివాళి.. ఏనుగుకు పునీత్ పేరు

అప్పుకు అరుదైన నివాళి.. ఏనుగుకు పునీత్  పేరు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సక్రేబైలు ఏనుగుల శిబిరంలోని ఓ రెండేళ్ల గున్న ఏనుగుకు పునీత్ రాజ్ కుమార్ గా నామకరణం చేశారు అధికారులు. ఇటీవల మృతి చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా ఏనుగుకు ఆయన పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. పవర్ స్టార్ రాజ్ కుమార్ చివరి రోజుల్లో ఈ శిబిరాన్ని సందర్శించారు. ఇక్కడ ఏనుగులతో రెండు గంటలు గడిపారని అధికారులు చెప్పారు. ఈ రెండేళ్ల ఏనుగును ఇటీవల తల్లి నుంచి వేరు చేశారు అధికారులు. తల్లి నుంచి వేరు చేసే సమయంలో పిల్ల ఏనుగు ప్రతిఘటించింది. తాళ్లతో బంధించి బలవంతంగా రెండు ఏనుగులను విడదీశారు. ట్రైనింగ్ లో భాగంగానే తల్లిఏనుగును విడదీశామని అధికారులు తెలిపారు.