కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : హనుమాన్ ఆలయంలో సీఎం పూజలు

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : హనుమాన్ ఆలయంలో  సీఎం పూజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై హుబ్బళ్లిలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..ఈ వీడియోలో ఆయన హనుమంతునికి హారతి ఇస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతకుముందు ఓటింగ్ జరిగిన మే 10న కూడా ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు.

ఈ రోజు కర్ణాటకకు గొప్ప రోజు అని, రాష్ట్రానికి సంబంధించి ప్రజల తీర్పు వెలువడుతుందని, బీజేపీ సంపూర్ణ మెజారిటీతో గెలిచి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందన్న విషయాన్ని సీఎం బసవరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 110 స్థానాల్లో.. బీజేపీ 73 సీట్లలో.. జేడీఎస్ 24 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరీలోని 6 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్ లో ఉంది. అది కూడా సీఎం బొమ్మై నియోజకవర్గమైన షిగ్గావ్ కావడం గమనార్హం.

https://twitter.com/ANI/status/1657215186376482816