కర్ణాటక కేబినెట్: కొత్త మంత్రులకు శాఖలు

కర్ణాటక కేబినెట్: కొత్త మంత్రులకు శాఖలు

బెంగళూరు: కర్ణాటకలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం బసవరాజ్ బొమ్మై. ఫైనాన్స్ , కేబినేట్ వ్యవహారాలు, బెంగళూరు డెవలప్‌మెంట్ సహా ఇతరులకు కేటాయించని శాఖలు తన దగ్గరే ఉంచుకున్నారు.  అరగ జ్ఞానేంద్రకు హోం శాఖ బాధ్యతలు ఇచ్చారు. కేఎస్‌ ఈశ్వరప్పకు రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ శాఖలు అప్పగించారు. రెవెన్యూ శాఖ బాధ్యతలు ఆర్‌‌ అశోకకు ఇచ్చారు. బి.శ్రీరాములుకు ట్రాన్స్ పోర్ట్, ఎస్టీ అభివృద్ధి శాఖను కేటాయించారు. బి.సి పాటిల్‌కు వ్యవసాయ శాఖ, గోవింద్ మక్తప్ప కరజోల్‌కు ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. సునీల్ కుమార్‌‌కు విద్యుత్ శాఖను, బీసీ నగేశ్‌కు ప్రాథమిక విద్యా శాఖ కేటాయించారు.
ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో గత నెల 28న ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మై కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారం తర్వాత ఈ బుధవారం నాడు ఆయన తన కేబినెట్‌ను విస్తరించారు. 29 మందితో ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్గంలో చాలా మంది పాతవాళ్లన అలానే ఉంచారు.