Siddaramaiah : మద్దతుదారుని చెంపదెబ్బ కొట్టిన సిద్ధరామయ్య

Siddaramaiah : మద్దతుదారుని చెంపదెబ్బ కొట్టిన సిద్ధరామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాసేపు సహనం కోల్పోయారు. ఉదయం ఆయన ఇంటినుంచి బయలుదేరే ముందు అక్కడ భారీగా నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారు. దీంతో పోలీసులు, బాడీగార్డులు వారిని  పక్కకు నెడుతూ ఆయనను కారు దగ్గరికి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో ఓ మద్దతుదారుడు సిద్ధరామయ్యను కలిసే ప్రయత్నం చేశాడు.  సిద్ధరామయ్య వద్దకు వచ్చి ఏదో చెప్పాలని అనుకున్న అతన్ని సిద్ధరామయ్య చెంపపై కొట్టాడు. అయినప్పటికీ అతను సిద్ధరామయ్య వెనకాలే కారు వద్దకు వెళ్లాడు.

https://twitter.com/ANI/status/1639231572468547585

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  చెంపదెబ్బకు గురైన వ్యక్తి సిద్ధరామయ్యకు స్వయంగా సహాయకుడని తెలుస్తోంది. మద్దతుదారలను సిద్ధరామయ్య చెంపదెబ్బ కొట్టడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో గతేడాది మైసూరు విమానాశ్రయం వెలుపల ఓ వ్యక్తిని కూడా ఆయన ఇలాగే  కొట్టారు. 

ఇక  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైసూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన వరుణ నుంచి పోటీ చేయవచ్చునని ఆయన  అన్నారు. ప్రస్తుతం వరుణ నియోజకవర్గంలో ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వరుణ నుంచి సిద్ధరామయ్య  రెండుసార్లు గెలిచారు. 2013లో ఆ స్థానం నుంచే గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.