
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా మంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అనూహ్యంగా టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం చేశారు.
హస్య బ్రహ్మగా పిలుచుకునే బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బెంగళూరు చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు మద్దతుగా ప్రచారం చేశారు. సుధాకర్ ఎంతో మంచివాడని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రచారంలో బ్రహ్మానందం సినిమా డైలాగ్ చెప్పి అలరించారు. ఖాన్స్ తో గేమ్స్ ఆడొద్దు శాల్తీలు లేచిపోతయ్ అని అనడంతో ఫ్యాన్స్ ఈలలు వేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా, మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. కాగా రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కన్నడ నాట ఈ సారి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.