రాసలీలల వీడియో వెనకున్నదెవరో చెప్త

రాసలీలల వీడియో వెనకున్నదెవరో  చెప్త

రాసలీలల వీడియో వెనుక ఉన్న అసలు సూత్రధారిని బయటపెడతానన్నారు కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోలి. గత కొన్ని రోజులుగా సీడీల గురించి చర్చ జరుగుతోందని..ఇంకా అలాంటి 10 సీడీలు రిలీజ్ చేసినా తాను భయపడేది లేదన్నారు. తాను కూడా సాక్ష్యాలు సేకరించానని.. సరైన సమయంలో సీడీల వెనకున్నదెవరో చెబుతానన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టనన్నారు. తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.  న్యాయవాది సూచనల మేరకు ఈ కేసు గురించి తాను ఎక్కువగా మాట్లాడలేనన్నారు.  కొన్ని రోజుల క్రితం రమేష్  ఓ యువతితో చనువుగా ఉన్న రాసలీలల వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో రమేశ్ తన మంత్రి పదవికి రాజీనమా చేశారు.