బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్యాన్స్‌కు, బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్. నగరంలోని ప్రఖ్యాత ఎం. చిన్నస్వామి స్టేడియంలో తిరిగి ఇంటర్నేషనల్, ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) శనివారం ప్రకటించింది. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్‌లను సొంత మైదానంలోనే ఆడనుంది. గతేడాది జూన్ 4న ఆర్సీబీ టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటన తర్వాత 8 నెలలుగా ఈ స్టేడియంలో ఎటువంటి మ్యాచ్‌లు జరగలేదు.
అయితే, భద్రతా ప్రమాణాలను పెంచేందుకు సుమారు 4.5 కోట్ల రూపాయల వ్యయంతో 300-–350 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్సీబీ నిర్ణయించింది. ప్రేక్షకుల రాకపోకలను నియంత్రించడం, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం వంటి అంశాలపై కేఎస్‌సీఏ ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను సమర్పించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొన్ని షరతులతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
