కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉంది

కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉంది

కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 32వ రోజు కర్నాటకలో కొనసాగింది. ఉదయం పోచ్ కట్టె గ్రామంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. పాద యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతీలావాదేవీపై 40శాతం కమీషన్ తీసుకుంటుందని తెలిపారు. 13వేల ప్రైవేట్ పాఠశాలలు 40శాతం కమీషన్ ఇచ్చాయని ఆరోపించారు. ఈ విషయం స్వయంగా బీజేపీ ఎమ్మెల్యేలే అంటున్నారని రాహుల్ చెప్పారు. 

రాష్ట్రంలో చాలా ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మకానికి ఉన్నాయన్నారు. సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను 80లక్షలకు అమ్మేశారన్నారని రాహుల్ గాంధీ అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు అమ్ముడుపోయాయన్నారు. 2500 కోట్లు ఇస్తే.. సీఎం పదవి కూడా కొనొచ్చని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారన్నారు. విద్వేశం, ప్రేమ మధ్య ఈ యుద్ధం కొత్తది కాదన్నారు. బీజేపీ వ్యాప్తి చేస్తోన్న ద్వేశం, హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు రాహుల్ గాంధీ. దేశం విడిపోదని...దేశం మొత్తం ఏకతాటిపై నిలబడుతుందని రాహుల్ తెలిపారు.