కోటి మంది మహిళల అకౌంట్లోకి నెలకు రూ.2 వేలు

కోటి మంది మహిళల అకౌంట్లోకి  నెలకు రూ.2 వేలు

అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో పథకాన్ని  అమలు చేస్తూ వస్తోంది.  ఈ  క్రమంలో  2023 ఆగస్టు 30న  కోటి మంది మహిళలకు నెలవారీ రూ.2 వేల ఆర్థిక సాయాన్ని అందించే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించనుంది. 

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ  రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.  ఇప్పటికే దాదాపు 1.08 కోట్ల మంది మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నేరుగా నెలకు రూ.2 వేలను బదిలీ చేస్తుందని  సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ.17 వేల 500 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.  'శక్తి', 'గృహ జ్యోతి', 'అన్నభాగ్య' అనే ఐదు 'హామీ'లలో మూడింటిని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని, 'గృహలక్ష్మి' నాల్గవదని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.