
- కాలేజీలో డ్రెస్ కోడ్ ఉంటే.. యూనిఫామ్‌లో పోవాలె
- కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్
బెంగళూరు: ఒక విద్యా సంస్థ యూనిఫాంతో రావాలని సూచిస్తే.. స్టూడెంట్లు తప్పకుండా పాటించాల్సిందేనని కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూరాజ్ అవస్థి కామెంట్ చేశారు. అది డిగ్రీ కాలేజీ అయినా.. ఇంటర్ కాలేజీ అయినా యూనిఫామ్‌ను సూచిస్తే పాటించాల్సిందేనని అన్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో మతపరమైన వస్త్రాలను అనుమతించొద్దన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్టూడెంట్లకు మాత్రమే వర్తిస్తాయన్నారు. అయితే ఇన్స్టిట్యూట్లు సూచించిన డ్రెస్‌ను కోడ్‌గా పాటించాల్సిందేనని చీఫ్ జస్టిస్ అన్నారు. హిజాబ్ బ్యాన్ కేసు, కండువాలను వేసుకురావొద్దని ఒత్తిడి చేశారన్న పిటిషన్లపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిసిన తర్వాత ఆయన ఈ కామెంట్లు చేశారు. ఈ కేసులో గురువారం మరోసారి పిటిషనర్లు వాదనలు వినిపించనున్నారు.