కన్నడ సాంగ్ కు స్టేజీపై డ్యాన్స్తో ఇరగదీసిన కలెక్టర్

కన్నడ సాంగ్ కు స్టేజీపై డ్యాన్స్తో ఇరగదీసిన కలెక్టర్

కర్నాటకలో కలెక్టర్ గోపాల కృష్ణ డ్యాన్స్ తో దుమ్మురేపారు. ఫుల్ ఎనర్జిటిక్ తో స్టేజీపైనే ఇరగదీశారు. డ్యాన్స్ మాస్టర్ ను మరిపించేలా స్టెప్పులతో అదరగొట్టారు.హెచ్‌డిఎంసి ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్న కలెక్టర్..కన్నడ సాంగ్కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. కలెక్టర్ డ్యాన్స్ ను చూసిన విద్యార్థులు, అధికారులు,స్థానికులు అందరూ  ఫుల్ ఫిదా అయ్యారు. కలెక్టర్ స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా అందరూ కేరింతలు కొట్టారు. ఆయన ఉత్సాహాన్నిచూసి అందరూ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. హుబ్బళ్లి- ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్‌డిఎంసి) కమిషనర్ బి. గోపాల్ కృష్ణ ఇటీవల ధార్వాడలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని..పాఠశాలలో చదువుకునే రోజుల్లో కూడా డ్యాన్స్ చేసేవాడినని చెప్పారు. స్వతహాగా తాను ఒక కళాకారుడినని...ఇప్పటికీ డ్యాన్స్ చేస్తూనే ఉంటానని తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India Today (@indiatoday)