166 హామీలు ఇస్తే.. 158 నెరవేర్చాం: కర్ణాటక మంత్రి ప్రియాంక

166 హామీలు ఇస్తే.. 158 నెరవేర్చాం: కర్ణాటక మంత్రి ప్రియాంక

కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని  కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చెప్పారు. కర్ణాటకలో 166 హామీలు ఇచ్చామని.. ఇప్పటివరకు158 హామీలను నెరవేర్చామని అన్నారు. కర్ణాటకలో 200 యూనిట్స్ లోపు విద్యుత్తు ఉచితంగా వాడుతూ.. 1.60 కోట్లమంది లబ్ది పొందుతున్నారని ఆమె తెలిపారు. 

నవంబర్ 21వ తేదీ మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లోమంత్రి ప్రియాంక ఖర్గే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  కర్ణాటకలో అన్న భాగ్య యోజన పథకం కింద 1.92కోట్ల మంది లబ్ది పొందుతున్నారని.. మహిళా శక్తి యోజన ద్వారా ప్రతి రోజు 60 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. ఎన్ సిఆర్ బి రికార్డుల ప్రకారం తెలంగాణలో రోజుకు ఒకటి లెక్కన ఆత్మహత్యలు జరిగాయన్నారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తేడా చెప్పాలంటే.. ప్రజల డబ్బును బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు మళ్లిస్తుందని... కాంగ్రెస్ మాత్రం, ప్రజల డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సర్కార్ లేదని.. ఫామ్ హౌస్, అవినీతి ప్రభుత్వం నడుస్తోందన్నారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలతో నిరుద్యోగులు మోసపోయారని.. కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించి రూ.లక్ష కోట్లను దోచుకున్నారని ప్రియాంక ఖర్గే విమర్శించారు.