
కర్ణాటక మంత్రి ఉమేష్ విశ్వానాథ్ కత్తి కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మరణించారు. 61 ఏళ్ల వయసున్న ఉమేష్ విశ్వానాథ్ సీఎం బసవరాజు బొమ్మై కేబినెట్ లో అటవీ, ఆహారం, పౌర సరఫరాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.
1985లో రాజకీయాల్లోకి వచ్చిన ఉమేష్ విశ్వానాథ్ 8 సార్లు హక్కేరి నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. మంత్రి మృతి పట్ల బసవరాజు బొమ్మై ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. ఉమేష్ రాష్ట్రానికి ఎంతో చేశారని కొనియాడారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని బొమ్మై తెలిపారు.
ಅರಣ್ಯ ಸಚಿವ, ನನ್ನ ಆಪ್ತ ಸಹೋದ್ಯೋಗಿ ಶ್ರೀ ಉಮೇಶ್ ಕತ್ತಿ ಅವರ ಅಕಾಲಿಕ ನಿಧನದಿಂದ ತೀವ್ರ ದುಃಖಿತನಾಗಿದ್ದೇನೆ. ಅವರ ನಿಧನದಿಂದ ರಾಜ್ಯ ಓರ್ವ ನುರಿತ ಮುತ್ಸದ್ಧಿ,ಕ್ರಿಯಾಶೀಲ ಮುಖಂಡ ಹಾಗೂ ನಿಷ್ಠಾವಂತ ಜನಸೇವಕನನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದೆ. ಅವರ ಅಗಲಿಕೆಯ ದುಃಖವನ್ನು ಸಹಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಆ ಭಗವಂತ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ pic.twitter.com/tcfNlw9Cdr
— Basavaraj S Bommai (@BSBommai) September 6, 2022
అటు ప్రధాని మోడీ కూడా ఉమేష్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన అనుభవజ్ఞుడైన నాయకుడు ఉమేష్ కత్తి మరణం తనని బాధించిందని మోడీ ట్వీట్ చేశారు.
Prime Minister Narendra Modi tweets, "Umesh Katti Ji was an experienced leader who made rich contributions to Karnataka’s development. Pained by his demise. My thoughts are with his family and supporters in this tragic hour. Om Shanti." https://t.co/IqzQJv1E2o pic.twitter.com/qD69eUeHrF
— ANI (@ANI) September 7, 2022