హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ సైసెక్, కాయిన్ డీసీఎక్స్కు చెందిన డిజిటల్ సురక్ష నెట్‌వర్క్ (డీఎస్ఎన్) ఒప్పందం చేసుకున్నాయి. బెంగళూరు టెక్ సమిట్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కాయిన్ డీసీఎక్స్ ఫౌండర్ రూపొందించిన డీఎస్ఎన్, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పనిచేస్తోంది.
ఈ భాగస్వామ్యంలో విద్యార్థులు, ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇవ్వడం, సైబర్ భద్రతపై కన్నడ భాషలో ప్రచారం నిర్వహించడం, సైబర్ భద్రతా పరిష్కారాలను రూపొందించే స్టార్టప్‌లకు సాయం చేయడం ప్రధాన లక్ష్యాలు. 2027 నాటికి కర్ణాటకలో కోటి మందికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
