- ఈ నెల 26 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు
- మెరిట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనుభవం ఆధారంగా ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఆయుష్ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ)లోని 45 స్పెషాలిటీల్లో 70 లెక్చరర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) గురువారం నోటిఫికేషన్ రిలీజ్చేసింది. అర్హులైన అభ్యర్థులు అర్హతలు, ఇతర నిబంధనలను https://mhsrb.telangana.gov.in వెబ్ సైట్ లో పరిశీలించి, ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.
దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 3 ఉదయం 10.30 గంటల నుంచి 4 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. మొత్తం 100 పాయింట్ల ప్రాతిపదికన చేపట్టే ఎంపిక ప్రక్రియలో సంబంధిత పీజీ డిగ్రీలో సాధించిన మార్కులకు గరిష్ఠంగా 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో అదే స్పెషాలిటీలో కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన అనుభవానికి గరిష్ఠంగా 20 పాయింట్ల వెయిటేజీ ఇస్తారు.
