Karnataka: కొడుకు స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న సిద్ధ రామయ్య

Karnataka: కొడుకు స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న సిద్ధ రామయ్య

కర్ణాటకలో ఎన్నికల సందడి మొదలైంది. త్వరలో ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 124 అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే కుమార్ ఉన్నారు. మరో ముఖ్య విషయమేమిటంటే సిద్ధ రామయ్య.. తన కుమారుడు యతీంద్ర స్థానమైన మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. గతంలో సిద్ధ రామయ్య అదే స్థానం నుంచి పోటీ చేసి పలు మార్లు విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన కొడుకు యతీంద్ర కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు. వరుణ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి కోలార్ నుంచి కాకుండా వరుణ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ సూచన మేరకు సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సిద్ధ రామయ్య వరుణ నుంచి పోటీ చేయనుండడంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా పార్టీ ప్రకటించిన జాబితాలో అసలు ఆయన పేరు కూడా లేకపోవడంతో యతీంద్రకు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లుండగా.. ప్రస్తుత అసెంబీ సభ్యుల పదవీకాలం మే24న ముగియనుంది.