కరోనా ఎఫెక్ట్.. హోలీ సెలబ్రేషన్స్‌‌పై నిషేధం

కరోనా ఎఫెక్ట్.. హోలీ సెలబ్రేషన్స్‌‌పై నిషేధం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటాన్ని చూస్తున్నాం. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. వైరస్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారంలో హోలీ పండుగ ఉండటంతో చాలా రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, కర్నాటక, హరియాణా స్టేట్స్‌‌ హోలీ సెలబ్రేషన్స్‌‌ను నిషేధించాయి. వరుసగా హోలీ, షబ్ ఏ బారత్, ఉగాది, గుడ్ ఫ్రైడే ఉండటంతో మరికొన్ని రాష్ట్రాలు సెలబ్రేషన్స్‌‌ను బ్యాన్ చేసే దిశగా నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నాయి. ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌‌ను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం, ముంబై, పూణె కార్పొరేషన్‌‌లు ప్రకటించాయి.