హ్యాపీ మూమెంట్.. భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్

హ్యాపీ మూమెంట్.. భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్

కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జపాన్’. కార్తికి ఇది 25వ చిత్రం. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌‌ పనుల్లో ఉన్నారు మేకర్స్. దీపావళికి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘టచ్చింగ్ టచ్చింగ్’ అంటూ సాగే పాటలో కార్తి డిఫరెంట్ స్టైల్‌‌లో కనిపిస్తున్నాడు.

జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన పాటకు ‘హ్యాపీ మూమెంట్.. నో మోర్ కామెంట్..బాడీ డిమాండ్.. టచ్చింగ్ టచ్చింగ్’ అంటూ  భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్ రాశారు. తమిళంతో పాటు తెలుగులోనూ కార్తి స్వయంగా ఈ పాటను పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌‌ యూట్యూబ్‌‌ ట్రెండింగ్‌‌లో ఉంది. చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌‌తో అన్ని మ్యూజికల్ ఫ్లాట్ ఫామ్స్‌‌లో టాప్‌‌లో  ఉంది. సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, సినిమాటోగ్రాఫర్  విజయ్ మిల్టన్ ఈ చిత్రంతో నటుడిగా కనిపించనున్నారు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.