
కార్తి హీరోగా వచ్చిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే కార్తి మరో సినిమాకు కూడా సీక్వెల్ రాబోతోంది. కార్తి డ్యూయల్ రోల్‌లో పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ‘సర్దార్’. దీనికి సీక్వెల్ ఉండబోతున్నట్టు గతంలో చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే ‘సర్దార్’కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. ఆ స్థానంలో యువన్ శంకర్ రాజాను తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు విలన్‌గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. మరోవైపు ‘96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లోనూ కార్తి నటించబోతున్నాడు. మధురై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించనున్నారు. సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ‘ఖైదీ 2’ కంటే ముందు ఈ రెండు సినిమాలను పూర్తి చేయనున్నాడు కార్తి. ఇక ప్రస్తుతం ‘జపాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళికి ఇది విడుదల కానుంది.