హీరో శివరాజ్ కుమార్తో కార్తీక్ అద్వైత్ కొత్త చిత్రం షురూ

హీరో శివరాజ్ కుమార్తో కార్తీక్ అద్వైత్ కొత్త చిత్రం షురూ

కన్నడ స్టార్ శివ రాజ్‌‌‌‌కుమార్ హీరోగా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కార్తీక్ అద్వైత్ దర్శకుడిగా కన్నడ, తెలుగు బైలింగ్విల్ మూవీని ప్రకటించారు. పద్మజ ఫిల్మ్స్, భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్స్‌‌‌‌పై ఎస్ఎన్ రెడ్డి, పి సుధీర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని,  మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతోందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని మేకర్స్ చెప్పారు.  

ఇందులో శివ రాజ్‌‌‌‌కుమార్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నట్టు దర్శకుడు కార్తీక్ అద్వైత్ అన్నాడు. ఆయన గతంలో విక్రమ్ ప్రభుతో 'పాయుమ్ ఒలి నీ యెనక్కు' తమిళ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌తో శాండల్‌‌‌‌వుడ్‌‌‌‌లోకి అడుగుపెడుతున్నాడు. హీరోయిన్ ఇతర నటీనటులను త్వరలోనే అనౌన్స్ చేస్తామని అన్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.