Karthik Raju: మెప్పించే ‘దీర్ఘాయుష్మాన్ భవ’.. ఘనంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Karthik Raju: మెప్పించే ‘దీర్ఘాయుష్మాన్ భవ’.. ఘనంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

కార్తీక్‌‌‌‌రాజు, నోయల్, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో వంకాయలపాటి మురళీకృష్ణ  నిర్మించిన చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. జులై 11న సినిమా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు నిర్మాతలు కెఎల్ దామోదర్ ప్రసాద్, నట్టి కుమార్ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని కోరారు. ఇదొక ఫ్యామిలీ ప్యాక్డ్‌‌‌‌ సినిమా అని, అందర్నీ ఆహ్లాదపరిచేలా ఉంటుందని దర్శకుడు పూర్ణానంద్ అన్నాడు.

ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ చెప్పారు. ఆమని, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, గెటప్ శ్రీను, జెమిని సురేష్ ఇతర పాత్రలు పోషించారు.