నాచగిరిలో కార్తీక వైభవం

నాచగిరిలో కార్తీక వైభవం

గజ్వేల్/వర్గల్, వెలుగు: వర్గల్ మండలం నాచగిరి క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. కార్తీక సోమవారం పురస్కరించుకొని క్షేత్రానికి హైదరాబాద్ జంట నగరాలతో పాటు గజ్వేల్ ప్రాంతాల నుంచి భక్తులు క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ అర్చకులు ఉదయం గర్భాలయంలో స్వామివార్లకు విశేష అభిషేకాలు అలంకరణ చేపట్టారు.

 భక్తులు స్వామివారి కల్యాణాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. సాయంత్రం హల్దీ వాగులో గంగా హారతిని వైభవంగా నిర్వహించారు. హైదరాబాదు సత్యనారాయణ డాన్స్ అకాడమీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా ఈవో విజయరామారావు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.