కన్నుల పండుగగా కందగిరి జాతర

 కన్నుల పండుగగా కందగిరి జాతర

కురవి, వెలుగు: కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కురవి మండలం  కందికొండ గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి, వేంకటేశ్వర స్వాముల జాతర కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో గుట్టపై వెలసిన స్వాములవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఎస్పీ సుధీర్​ రామ్​నాథ్​కేకన్​ గుట్టను సందర్శించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తొర్రూర్ డీఎస్పీ  కృష్ణ కిషోర్, మరిపెడ సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో  బందోబస్తు ఏర్పాటు చేశారు.  

గుట్ట వద్ద మాజీ మంత్రి  సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సతీమణి ప్రమీల, ఫైనాన్స్ కమిషన్ సభ్యులు మాలోతు నెహ్రూ నాయక్, అంబటి వీరభద్రం గౌడ్, నరహరి గౌడ్, బాదె నాగన్న  ఆయా పార్టీల నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, కురవి వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేసి, కార్తీక దీపాలను వెలిగించారు.