కార్తీకమాసం మూడో ఆదివారం(నవంబర్ 9).. అస్సలు నాన్ వెజ్ తినొద్దు.. సూర్యభగవానుడిని పూజించండి.. జాతకంలో దోషాలు తొలగుతాయి..!

కార్తీకమాసం మూడో ఆదివారం(నవంబర్ 9)..  అస్సలు నాన్ వెజ్ తినొద్దు.. సూర్యభగవానుడిని పూజించండి..  జాతకంలో దోషాలు తొలగుతాయి..!

కార్తీకమాసంలో  ప్రతి రోజు ముఖ్యమైనది.  ఈ మాసంలో మూడో ఆదివారం సూర్యభగవానుడికి చాలా ముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు.  ఈ ఏడాది కార్తీకమాసంలో మూడో ఆదివారం  నవంబర్​ 9 వ తేది వచ్చింది.   సూర్యాష్టకం.. ఆదిత్యహృదయం పఠించాలి. ఆ రోజున ఉపవాసం ఉండి, శివలింగానికి పాలు, గంగ, పంచదార, తేనె, బియ్యము వంటివి సమర్పించడం కూడా చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే జాతకంలో దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. 

సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. జనాలు నాన్​ వెజ్​  తినేందుకు మొగ్గు చూపుతారు.  కాని కార్తీకమాసం  మాసం మొత్తం సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమమని పండితులు చెబుతుననారు. ఈ మాసంలో మాంసాహారం, మద్యం సేవించడం, ఉల్లి, వెల్లుల్లి, గుమ్మడి కాయ తినడం నిషేధం. అయితే, కార్తీకమాసంలో  ఆదివారం రోజున కొబ్బరి, ఉసిరికాయ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. ఉసిరిచెట్టును లక్ష్మీస్వరూపంగా, విష్ణుమూర్తి కొలువై ఉండే వృక్షంగా భావిస్తారు. ఆదివారం ఉసిరిని ఆహారంగా తీసుకోరాదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి.

కార్తీక మాసంలో భక్తులు శివారాధన చేస్తారు. దీపారాధనతోపాటు శివుడికి అభిషేకాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది.  హిందూ సంప్రదాయంలో దీపానికి గొప్ప. ప్రత్యేకత ఉంది. దీపం కాంతికి చిహ్నం. జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజ గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉండాలని పెద్దలు చెబుతారు.

 కార్తీకమాసం మూడో ఆదివారం ( 2025 నవంబర్​ 9) తెల్లవారుజామున  తలారా స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. . కార్తీక మాసంలో ప్రతి రోజూ సాయంకాలం విష్ణు అర్పణంగా ఎవరైతే నూనెతో దీపం వెలిగిస్తారో.. వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం


 సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. నదిలో స్నానమాచరించి.. అక్కడి దైవాన్ని దర్శించి.. గుళ్లో దీపాలు వెలిగించాలి. నదుల్లో దీపాలను వదిలేయాలి. నదులకు వెళ్లలేని వాళ్లు ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి.. దైవాన్ని పూజించి.. దీపారాధన చేయాలి. ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపాలను వెలిగించడం మంచిది. దగ్గర్లోని గుడికి వెళ్లి దీపాలు వెలిగించాలి. 


కార్తీక మాసంలో ఆదివారం సూర్యభగవానుడిని పూజించాలి.   హిందువులచేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుంది. అందులో  సూర్య నమస్కారాలు  ఒకటి. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ కూడా చెబుతున్నది.  ఉదయం వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి.  అవిశరీరాన్ని తాకాలని వైద్యులు కూడా చెబుతుంటారు.  అందుకే పసిబిడ్దలను పొద్దున్నే వచ్చే ఎండ కిరణాలు తాకేలా ఉంచుతారు.  

ఇక ఈ నెలలో ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉంది.  కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా ఆహారం లేకుండా ఉండలేనివాళ్లు పాలు పండ్లు తీసుకోవచ్చు. సూర్యోదయానికి ముందే నదీ స్నానాలు చేయాలి. సూర్యభగవానుడు తన కిరణాలతోసౌరశక్తిని నదీజలాలపై ప్రసరింప చేస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన వారి శరీరాలకు దీనివల్ల సౌర శక్తి లభిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.