ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో కార్తికేయన్‌‌‌‌‌‌‌‌, రౌత్‌‌‌‌‌‌‌‌కు నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌

ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో  కార్తికేయన్‌‌‌‌‌‌‌‌, రౌత్‌‌‌‌‌‌‌‌కు నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌

అల్ ఐన్ (యుఏఈ): ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా  గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్ మురళీ కార్తికేయన్ నాలుగో స్థానం సాధించాడు. విమెన్స్ సెక్షన్‌‌‌‌‌‌‌‌ లో పద్మిని రౌత్ కూడా నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకొని ఇండియా తరఫున బెస్ట్ పెర్ఫామెన్స్ చేశారు. ఓపెన్ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో15 ఏండ్ల రష్యా గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్ ఇవాన్ జెమ్యాన్‌‌‌‌‌‌‌‌స్కియా  ఫిడే జెండా కింద పోటీలో పాల్గొని  తొమ్మిది రౌండ్లలో అత్యధికంగా 8 పాయింట్లు నెగ్గి విజేతగా నిలిచాడు. ఇరాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన 15 ఏండ్ల  సినా మొహావెద్ 7.5 పాయింట్లతో రెండో ప్లేస్ సొంతం చేసుకోగా.. రష్యా ఆటగాడు రుడిక్ మకారియన్ 7 పాయింట్లు బెస్ట్ టైబ్రేక్ స్కోర్‌‌‌‌‌‌‌‌తో మూడో స్థానం సాధించాడు. 

కార్తికేయన్‌‌‌‌‌‌‌‌ కూడా 7 పాయింట్లు రాబట్టినా తక్కువ టైబ్రేక్ స్కోర్ కారణంగా నాలుగో స్థానం అందుకోగా.. అన్నే పాయింట్లతో మరో ఇండియన్‌‌‌‌‌‌‌‌ నీలాష్ సాహా ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. మాజీ బ్లిట్జ్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్ అలెగ్జాండర్ గ్రిషుక్, అతని భార్య  కాటెరీనా లాగ్నో  ఓపెన్‌‌‌‌‌‌‌‌, విమెన్స్ సెక్షన్లలో టాప్ సీడ్లుగా బరిలోకి దిగినప్పటికీ పోడియంపైకి రాలేకపోయారు. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌లో కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన అలువా నుర్మాన్ 7.5 పాయింట్లతో విజేతగా నిలవగా..  రష్యా  ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వాలెంటినా గునినా రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. చైనాకు చెందిన యూక్సిన్ సాంగ్ ఇండియా అమ్మాయి పద్మిని రౌత్ కంటే మెరుగైన టైబ్రేక్ స్కోర్‌‌‌‌‌‌‌‌తో మూడో స్థానం సాధించింది..