కసమ్కు మోస్ట్​ వాల్యుబుల్​ ప్రొఫెషనల్ ​ టైటిల్ 

కసమ్కు మోస్ట్​ వాల్యుబుల్​ ప్రొఫెషనల్ ​ టైటిల్ 
  • వరించిన మైక్రోసాఫ్ట్​ ‘మోస్ట్​ వాల్యుబుల్​ ప్రొఫెషనల్’ ​ టైటిల్ 

ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​ చదువుకోవాలనుకున్నాడు. కానీ, పేదరికం అడ్డు పడింది. కన్న  కలలన్నింటినీ చిదిమేసింది. డిగ్రీ వైపు నడిపించింది. ఆ క్షణం అనుకున్నాడు. తనలా మరెవరూ  డబ్బులేక  నచ్చిన చదువుకి దూరం కావద్దని. తనలాంటి పరిస్థితి మరొకరికి వద్దని. ఆ మంచి ఆలోచనే ఇప్పుడు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో ‘ది  మైక్రోసాఫ్ట్​ మోస్ట్​ వాల్యుబుల్​ ప్రొఫెషనల్’ ​ టైటిల్​ తెచ్చిపెట్టింది అతనికి. 
మన దేశం నుంచి ఈ ఘనత అందుకున్న  ఐదో వ్యక్తిగా కసమ్​ షేక్​ని నిలబెట్టింది. అతని గురించి మరిన్ని విషయాలు. మైక్రోసాఫ్ట్​ ఏటా ‘ది మైక్రోసాఫ్ట్​ మోస్ట్​ వాల్యుబుల్ ప్రొఫెషనల్​’ పేరుతో అవార్డులు ఇస్తుంటుంది. ఇందులో స్పెషలేంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న టెక్నాలజీ కమ్యూనిటీ లీడర్స్​కి ఈ అవార్డులు ఇస్తారు. అంటే ఎవరైతే వాళ్ల టెక్నికల్​ నాలెడ్జ్​ని యూజర్స్​తో లేదా మైక్రోసాఫ్ట్​తో షేర్​ చేసుకుంటారో వాళ్లకి ఇస్తారు. రీసెంట్​గా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని  ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది అందుకున్నారు. వాళ్లలో మన దేశానికి చెందిన 35 యేండ్ల కసమ్ షేక్ ఒకడు. 
మహారాష్ట్రకి చెందిన కసమ్​ షేక్​కి చిన్నప్పట్నించీ ఏరోనాటికల్​ ఇంజినీరింగ్​ చదవాలన్నది డ్రీమ్.  కానీ, ఆ కలకి పేదరికం గండి కొట్టింది. తండ్రి చావు అతన్ని కంప్యూటర్​ సైన్స్​ వైపు నడిపించింది. అయినా నిరుత్సాహపడలేదు కసమ్​​.  కష్టపడి చదివాడు. ఒక వైపు చదువుకుంటూనే  ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని మోశాడు. అతని హార్డ్​వర్క్​కి తగ్గట్టే గ్రాడ్యుయేషన్​  పూర్తయ్యాక కార్పొరేట్​ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ,  ఆ తర్వాత అందరిలా తన కష్టాలన్నీ తీరిపోయాయని రిలాక్స్​ కాలేదు కసమ్. తనలా డబ్బులేక నచ్చిన చదువుకి దూరమవుతున్న వాళ్ల గురించి ఆలోచించాడు.  వాళ్లకోసం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​కి​ సంబంధించిన నాలుగు బుక్స్​ రాశాడు. ఇంజినీరింగ్​ కాలేజీల్లో గెస్ట్​ లెక్చరర్​గా తన నాలెడ్జ్​ని షేర్​ చేసుకున్నాడు. యూట్యూబ్ ద్వారా తన టెక్నికల్​ నాలెడ్జ్​ని షేర్​ చేస్తున్నాడు. ఈ ప్యాండెమిక్​లో ఏకంగా మైక్రో సాఫ్ట్​ క్లౌడ్​ మీద ఇరవైకి పైగా బుక్స్​ ప్రింట్​ చేశాడు. పేద విద్యార్థుల కోసం కసమ్​ చేస్తున్న ఈ మంచి పనిని గుర్తించిన మైక్రోసాఫ్ట్​ అతడ్ని ఈ అవార్డుతో  గౌరవించింది.