న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం

న్యూయార్క్ అసెంబ్లీలో ‘కాశ్మీర్’ తీర్మానం

న్యూయార్క్​:  ఫిబ్రవరి 5వ తేదీని కాశ్మీర్ అమెరికన్ డేగా డిక్లేర్ చేయాలంటూ ప్రవేశపెట్టిన ఓ తీర్మానాన్ని న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ పాస్ చేసింది. అసెంబ్లీ మెంబర్ నాదర్ సయేఘ్, మరో 12 మంది మెంబర్లు ఈ రిసొల్యూషన్ ను ప్రవేశపెట్టారు. న్యూయార్క్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీల్లో కాశ్మీరీ కమ్యూనిటీ కీలక పిల్లర్ గా నిలిచిందని వారు పేర్కొన్నారు. కాశ్మీరీ ప్రజలకు మత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులు పొందేందుకు న్యూయార్క్ స్టేట్ కృషి చేస్తుందని అందులో వివరించారు. అయితే ఈ తీర్మానాన్ని వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ స్పోక్స్ పర్సన్ శనివారం తీవ్రంగా ఖండించారు. ఇది జమ్మూ కాశ్మీర్ ను మిస్ రిప్రజెంట్ చేయడమేనని, ప్రజల మధ్య విభజన రేఖ గీయడమేనని తప్పుపట్టారు.

సెంట్రల్ అమెరికా దేశాలతో యాంటీ ఇమిగ్రేషన్ డీల్స్ కు బైడెన్ గుడ్ బై

సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలా, హోండురాస్ దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లాలని ఎదురు చూస్తున్న  ప్రజలకు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఊరట కలిగే వార్తను ప్రకటించారు. అమెరికాలో ఈ దేశాల వారికి ఆశ్రయాన్ని నిషేధిస్తూ ఇంతకుముందు ప్రెసిడెంట్ ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విపత్తు మొదలైన తర్వాత యూఎస్–మెక్సికో బార్డర్ ద్వారా సెంట్రల్ అమెరికా నుంచి ఎవరినీ అమెరికాలోకి కాలు పెట్టకుండా ట్రంప్ సర్కార్ అడ్డుకుంది. అయితే తమ ప్రభుత్వం ఆయా దేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటోందని, అందుకే యాంటీ అసైలమ్ అగ్రిమెంట్ల రద్దు ప్రాసెస్​ను మొదలుపెట్టామని శనివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు.