
వాషింగ్టన్: కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుతిమెత్తగా మందలించారు. కాశ్మీర్ ఇష్యూపై ఇండియాతో సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. పొరుగుదేశంతో మాట్లాడేటప్పుడు హద్దులకు లోబడి సమర్థంగా వ్యవహరించాలన్నారు. టెన్షన్లకు ఆస్కారంలేకుండా ఇండియా-పాకిస్తాన్ రెండూ సంయమనం పాటించాలని కోరారు. జమ్మూకాశ్మీర్‌లో స్పెషల్ స్టేటస్ రద్దు తర్వాత రెండు దేశాల మధ్య టెన్షన్లను నివారించడానికి ట్రంప్ ముందుగా మన ప్రధాని నరేంద్రమోడీతోనూ ఆ తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌తోనూ ఫోన్లో మాట్లాడారు. కొంతమంది నాయకులు ఇండియాకు వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ వల్ల ఈ ప్రాంతంలో శాంతికి ఇబ్బందులు కలుగుతాయని మోడీ అమెరికా ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లారు. మోడీతో అరగంట సేపు మాట్లాడిన తర్వాత ఆయన ఖాన్‌తోనూ మాట్లాడారు.