స్వగ్రామంలో కత్తి మహేష్ అంత్యక్రియలు

స్వగ్రామంలో కత్తి మహేష్ అంత్యక్రియలు

చిత్తూరు: ప్రముఖ సీని విమర్శకుడు, నటుడు కత్తిమహేష్ అంత్యక్రియులు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని  యర్రావారిపాలెం మండలం  యలమంద గ్రామంలో సోమవారం జరిగాయి. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కత్తిమహేష్ కు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
తరలివచ్చి నివాళులర్పించిన మాల/మాదిగ నేతలు
కత్తిమహేష్ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మాల, మాదిగ సంఘాల నేతలు తరలివచ్చారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రావు, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కనకరావులు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కత్తిమహేష్ మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, కత్తి మహేష్ ను కాపాడుకొనేందుకు ఎంతో ప్రయత్నించారని, అయితే దురదృష్టవశాత్తు మృతి చెందడం బాధాకరమని రెల్లి, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్లు మధుసుదన్ రావు, కనకరాజు తెలిపారు.