కౌశిక్ రెడ్డికి 14 మంది బౌన్సర్ల సెక్యూరిటీ

కౌశిక్ రెడ్డికి 14 మంది బౌన్సర్ల సెక్యూరిటీ

హుజురాబాద్, వెలుగు: బీఆర్ఎస్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రభుత్వ గన్ మన్లకు తోడుగా బీఆర్ఎస్​ హైకమాండ్​ 14 మంది బౌన్సర్లతో సెక్యూరిటీ కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో  కాంగ్రెస్  శ్రేణులు దాడులు చేయవచ్చనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంగళవారం హుజురాబాద్ లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన చుట్టూ బౌన్సర్లు కనిపించారు. ఆయనపై దాడులు జరగొచ్చనే సమాచారంతో అంబేద్కర్ చౌరస్తా నుంచి కాకుండా ఇతర మార్గం ద్వారా ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ కు పంపించారు.