కవిత రాజీనామాకు ఆమోదం.. లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ

కవిత రాజీనామాకు  ఆమోదం..  లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్. వెలుగు:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత... తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు.

2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న కవిత రాజీనామా చేశారు. సోమవారం కౌన్సిల్ లో ప్రసంగించిన సందర్భంలో తన రాజీనామాను ఆమోదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దాంతో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాను ఆమోదించారు. 

6 వ తేదీనుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంటుందని నోటిఫికేషన్ లో చైర్మన్ పేర్కొన్నారు. కాగా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైకవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 

తొలుత హరీశ్ రావు, కేటీఆర్ టార్గెట్ గా కామెంట్స్ చేసిన ఆమె.. తాజాగా ఏకంగా తన తండ్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై మండలిలో ఎమోషనల్ అయ్యారు.