బీసీలకు 50%  రిజర్వేషన్లపై ఆగస్టు 6న సభ..సామాజిక తెలంగాణ సాధన సభ పేరిట నిర్వహణ: కవిత

బీసీలకు 50%  రిజర్వేషన్లపై ఆగస్టు 6న సభ..సామాజిక తెలంగాణ సాధన సభ పేరిట నిర్వహణ: కవిత

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్‌‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం బంజారాహిల్స్‌‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు.

‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’ పేరుతో  బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపైకి తీసుకువస్తామని కవిత చెప్పారు. తద్వారా 50 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. "ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం.. ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటు పడుదాం" అన్న ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకే తాము ఈ పోరాటం చేస్తున్నామని కవిత స్పష్టం చేశారు.

బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన సభ దేశ గతినే మార్చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అదే విధంగా, దేశవ్యాప్తంగా బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం జరిగే ఉద్యమాలకు హైదరాబాద్ సభ దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఆగస్టు 6న జయశంకర్ సార్ జయంతిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ‘సామాజిక న్యాయ తెలంగాణ దినోత్సవం’గా నిర్వహిస్తామని ప్రకటించారు.