అధికారంలో లేకున్నా నిర్వాసితుల కోసం కొట్లాడుతా

అధికారంలో లేకున్నా నిర్వాసితుల కోసం కొట్లాడుతా

వనపర్తి/పెబ్బేరు/కొత్తకోట, వెలుగు : తాము అధికారంలో లేకపోయినా నిర్వాసితుల సమస్యలపై పోరాడుతామని, వారికి న్యాయం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆమె ముందుగా కొత్తకోట కానాయపల్లి శంకర సముద్రం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను, వనపర్తిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. కానాయపల్లి శంకరసముద్రం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి 12 ఏండ్లు అయినా నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు చాలా మంది లీడర్లు వచ్చి హామీలు ఇచ్చి మోసం చేశారని, తాను మహిళా నాయకురాలినైనా కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

 నిర్వాసితులకు వాళ్ల ప్లాట్ల దగ్గరే డబుల్‌‌‌‌‌‌‌‌ బెడరూం ఇంటిని కట్టించాలని, గతంలో పేర్లు మిస్సయినా 30, 40 మందికి ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మల్లన్నసాగర్, మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు, రంగనాయకసాగర్‌‌‌‌‌‌‌‌ నిర్వాసితులకు ఇచ్చిన బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను ఇక్కడా ఇవ్వాలని కోరారు. కొత్తకోటలో చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గతంలో చేనేత కార్మికులకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన పెన్షన్, నూలు సబ్బిడీని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వచ్చాక ఆపేసిందన్నారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సబ్సిడీని విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. రాజకీయ పార్టీలు పద్మశాలీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం పెబ్బేరు మార్కెట్‌‌‌‌‌‌‌‌ యార్డులో రైతులతో మాట్లాడుతూ.. తేమ శాతం పేరుతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. పాతపల్లిలో మధ్యలో ఆగిపోయిన డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లను పరిశీలించారు. జాగృతి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కరాటే శ్రీను, మాలతి పాల్గొన్నారు.