 
                                    హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. గురువారం ఉదయం ఆమె తన భర్త అనిల్‌తో కలిసి.. కోకాపేటలోని హరీశ్ నివాసానికి వెళ్లారు. హరీశ్ తండ్రి సత్యనారాయణ రావుకు నివాళులర్పించారు. అనంతరం ఆమె తన మేనత్త లక్ష్మిని పలకరించి ఓదార్చారు.
కవిత, అనిల్‌తో పాటు అనిల్ తమ్ముడు అరుణ్, జాగృతి నాయకులు హరీశ్ రావును పరామర్శించారు. ప్రస్తుతం కవిత జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ యాత్రకు గురువారం బ్రేక్ ఇచ్చిన ఆమె.. హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. మళ్లీ శుక్రవారం జనంబాట కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.

 
         
                     
                     
                    