ఢిల్లీ లిక్కర్ స్కామ్ ..  కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ..  కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన  మనీలాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమె  జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండటంతో  కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. ఈ క్రమంలో జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో   కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.