ఎమ్మెల్సీ కవితతో విష్ణు వర్ధన్ రెడ్డి భేటీ వెనుక మర్మమేంటి.?

ఎమ్మెల్సీ కవితతో విష్ణు వర్ధన్ రెడ్డి భేటీ వెనుక మర్మమేంటి.?
  •    పెద్దమ్మతల్లి నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానం
  •     జూబ్లీహిల్స్ బై పోల్​పై ఇద్దరు నేతల చర్చ!

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవితతో పీజేఆర్ కొడుకు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆమె ఇంట్లో సమావేశం అయ్యారు. 30 నిమిషాల పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాట్లాడుకున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విష్ణు కాంగ్రెస్ టికెట్ ఆశించగా హైకమాండ్ నిరాకరించింది. 

దీంతో ఎన్నికల ముందు విష్ణు బీఆర్ఎస్ లో చేరారు. త్వరలో జరగనున్న బై పోల్ లో విష్ణు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతకుముందు.. త్వరలో ప్రారంభంకానున్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలకు రావాలని కవితను విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానించారు. వేదపండితులతో ఆశ్వీరచనాలు అందజేశారు.