మసూద, బలగం చిత్రాలతో వరుస విజయాలు అందు కున్న కావ్యా కళ్యాణ్‌రామ్... ‘ఉస్తాద్’తో ప్రేక్షకుల ముందు కొస్తోంది. శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి ఫణిదీప్ దర్శకుడు. రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూ రు నిర్మాతలు. ఈనెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా కావ్య మాట్లాడుతూ ‘కంటెంట్‌పై నమ్మకంతో రెండు పెద్ద చిత్రాల మధ్య వస్తు న్నాం. సూర్య అనే పాత్రలో శ్రీసింహా నటిస్తుండగా.. తన లవర్ మేఘన పాత్రలో నటించాను.
అతని జీవితంలో మార్పుకు కారణమయ్యే అమ్మాయిలా కనిపిస్తా. మానసి కంగా తను చాలా బలవంతురాలు. తన పాత్ర చాలా మంది అమ్మా యిలకు నచ్చుతుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ప్రమోషన్స్ కోసం కాలేజీలకు వెళ్తే చాలా మంచి స్పందన వచ్చింది. ఇక కొన్ని కొత్త సినిమాలకు ఓకే చెప్పాను. త్వరలో నిర్మాతలే ఆ చిత్రాలను అనౌన్స్ చేస్తారు’ అని చెప్పింది.