V6 News

Kayadu Lohar: 'ఫంకీ'తో కయాదు లోహర్ డబుల్ క్రేజ్ ప్లాన్.. విశ్వక్సేన్‌తో హిట్ కొడితే ఆ ఐదు సినిమాలు కన్ఫామేనా?

Kayadu Lohar: 'ఫంకీ'తో కయాదు లోహర్ డబుల్ క్రేజ్ ప్లాన్.. విశ్వక్సేన్‌తో హిట్ కొడితే ఆ ఐదు సినిమాలు కన్ఫామేనా?

 'డ్రాగన్' సినిమాతో యూత్ ఆడియ న్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కయాదు లోహర్. అంతకుముందు శ్రీ విష్ణు 'అల్లూరి'లోనూ మెరిసింది. కొత్త ఏడాదిలో విశ్వక్సేన్ 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం కయాదు తెలుగు కూడా నేర్చుకుంటోంది.

అయితే 'ఫంకీ' తర్వాత నెక్స్ట్ టాలీవుడ్ మూవీ ఏదన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే రవితేజతో ఒక సినిమా చేస్తుందన్న టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని తేలింది. మరోవైపు ఆడియన్స్ లో ఆమెకున్న హాట్ ఇమేజ్ కి తెలుగులో ఎలా లేదన్నా ఒక ఐదారు సినిమాలు వెంట వెంటనే పడేలా ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ 'ఫంకీ' హిట్ పడితే ఆ చాన్స్ లు వస్తాయని అంటున్నారు.

 కయాదు ఓ పక్క తమిళ్ లో దూసు కెళ్తూనే తెలుగులో తనకున్న ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు అనుదీప్ దర్శకతoలో రూ పుదిద్దుకుంటున్న ఫంకీతో విశ్వక్ సేన్ కూడా ఒక మంచి సక్సెస్ అందుకోవా లని చూస్తున్నాడు. ఈమూవీ సక్సెస్ తో తెలుగులో రెండో ఇన్నింగ్స్ అదరగొట్టేయాలని.. డబుల్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది కయాదు లోహర్.