కేబీఆర్ పార్కు వ‌‌ద్ద వ‌‌ర‌‌ద క్లియర్ ... ఇంజిన్లు పెట్టి నీటిని తోడిన్రు

కేబీఆర్ పార్కు వ‌‌ద్ద వ‌‌ర‌‌ద క్లియర్ ... ఇంజిన్లు పెట్టి నీటిని తోడిన్రు

హైదరాబాద్ సిటీ. వెలుగు: కేబీఆర్ పార్కు మెయిన్​ గేటు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వెళ్లే మార్గంలో నిలిచిన నీటిని మంగళవారం హైడ్రా తొల‌‌గించింది. మంత్రి పొన్నం ప్రభాక‌‌ర్‌‌, మేయ‌‌ర్  గ‌‌ద్వాల్ విజ‌‌య‌‌ల‌‌క్ష్మి ఈ ప‌‌నుల‌‌ను ప‌‌ర్యవేక్షించారు. కేబీఆర్ పార్కు రోడ్డును దాటి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపు లైన్లు విస్తరించాల్సి ఉంద‌‌ని, రోడ్డుకు ఒకవైపు రోడ్డు మీద నుంచే నీరు పోవాల్సిన ప‌‌రిస్థితి ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స‌‌మ‌‌స్యను కౌన్సిల్‌‌లో పెట్టి పైపులైన్ల ఏర్పాటు ప‌‌నుల‌‌ను మంజూరు చేయిస్తామని  హామీఇచ్చారు. హైడ్రా ఏడీఎఫ్‌‌వో మోహ‌‌న్ రావు, జీహెచ్ఎంసీ ఈఈ విజయ్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఉన్నారు.