మీ కెమెరాకు పని చెప్పండి: కేబీఆర్ పార్క్ బ్యూటీని క్లిక్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లకు ఆహ్వానం

మీ కెమెరాకు పని చెప్పండి: కేబీఆర్ పార్క్ బ్యూటీని క్లిక్ చేసేందుకు ఫొటోగ్రాఫర్లకు ఆహ్వానం

హైదరాబాద్: కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్.. అదే కేబీఆర్ పార్క్.. నగరంలో నడిబొడ్డున ఉన్న నేషనల్ పార్క్..జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో విస్తరించిన ఈ పార్క్ నెమళ్లకు ప్రసిద్ధి.. అంతేకాదు. అందమైన ప్రకృతి, జంతువులతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.. మార్నింగ్ వాకర్లకు ఈ పార్క్ ఎంతో ప్రియమైన ప్రాంతం. పొద్దున, సాయంత్రం వాకింగ్ చేసేందుకు ప్రముఖులతో పాటు సాధారణ జనం కూడా కేబీఆర్ పార్క్ కు వస్తుంటారు. కేబీఆర్ పార్క్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. 

ఈ వార్షికోత్సవాన్ని నిర్వాహకులు అపూర్వమైన వేడుకగా జరపాలని నిర్ణయించారు. అందుకోసం కెమెరా ఐస్ త్రో కేబీఆర్  పేరుతో పార్క్ లోని వృక్ష జాలం, జంతుజాలం క్లిక్ చేసేందుకు  ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్లు, ప్రకృతి ప్రియులను ఆహ్వానిస్తోంది. పార్క్ లోని జంతువులు, మొక్కలు, వ్యక్తులు, ప్రకృతి దృశ్యాలతో కూడిన ఫొటోలను పంపించాలని కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు తమ చిత్రాలను పేరుతో స్టాప్ చేసి ఒక్కో కేటగిరికి గరిష్టంగా మూడు ఎంట్రీలతో పంపాలని సూచించారు నిర్వాహకులు. 

నవంబర్ 28 లోపు జిల్లా ఫారెస్ట్ orestofficerhyd22@gmail.comకు మెయిల్ ద్వారా తమ ఎంట్రీలను పంపించాలని కోరారు. ఎవైనా సందేహాలుంటే 9063986149 కు ఫోన్ చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనురాధను సంప్రదించాలి. ఎంపిక చేయబడిన ఫొటోలు కేబీఆర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ లో ప్రదర్శనలో ఉంచుతారు.