
వేములవాడ, వెలుగు: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు 25న హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే సీఎం అపాయింట్‌మెంట్‌ను చెన్నమనేని కోరారని, 25న లేదంటే 26న సీఎంను కలిశాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెప్తున్నారు. వేములవాడ టికెట్ లక్ష్మీ నరసింహరావుకు కేటాయించారు. పౌరసత్వ వివాదంతోనే రమేశ్‌బాబును పక్కనపెడ్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.
దీంతో నియోజకవర్గంలో చెన్నమనేని అనుచరులు నారాజ్ అయ్యారు. ఇదే సమయంలో రమేశ్ బాబు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య అనుచరులకు ఫోన్ చేసిన చెన్నమనేని.. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని, బీఆర్ఎస్‌లో తనకు ఇంకా దారులు మూసుకుపోలేదని చెప్పినట్లు తెలిసింది. తాను జర్మనీ నుంచి వస్తున్నానని, 25న లేదంటే 26న సీఎంను కలిశాకే పూర్తి క్లారిటీ వస్తుందని, అప్పటిదాకా సైలెంట్‌గా ఉండాలని చెప్పినట్లు సమాచారం.