కేసీఆర్ నోట.. మక్క గడ్క మాట

కేసీఆర్ నోట.. మక్క గడ్క మాట

కొత్తమున్సిపల్ చట్టంతో ప్రభుత్వం ఏం చేయదల్చుకున్నదో వివరించారు సీఎం కేసీఆర్. జాతిపిత మహాత్ముడు చెప్పిన స్వపరిపాలన నినాదంతో తన ప్రసంగం ప్రారంభించారు సీఎం కేసీఆర్. పంచాయతీ రాజ్ అనేది కూడా ఓ మూవ్ మెంట్ అనీ.. అది డిపార్టుమెంట్ కాదని చెప్పారు. పంచాయతీ రాజ్ ఉద్యమాన్ని మాజీ కేంద్రమంత్రి ఎస్కే డే ప్రారంభించారనీ. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ను హైదరాబాద్ లోనే స్థాపించారని చెప్పారు.  ఇక్కడినుంచే దేశమంతటా ప్రమోట్ చేశాని అన్నారు.

“అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్, ఇండియా ప్రధాని నెహ్రూ అప్పట్లో మంచి స్నేహితులు. నెహ్రూ అమెరికా వెళ్లినప్పుడు.. ఎస్కే డే ఓసారి అక్కడే ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ హోవర్… నెహ్రూకు ఎస్కే డే గురించి పరిచయం చేశారు. అమెరికా రూరల్ డెవలప్ మెంట్ కు ఆయనే ఇంచార్జి అని… మంచి ఫలితాలు రాబడుతున్నారని నెహ్రూకు హోవర్ చెప్పారు. మా భారతీయుడిని అమెరికా అధ్యక్షుడు పొగుడుతుంటే నెహ్రూ సంతోషించారు. ఎస్కే డేని నెహ్రూ లంచ్ కు పిలిచారు. మీరు అమెరికాలో కాదు.. ఇండియాకు రండి అని నెహ్రూ పిలిచారు. అప్పుడు ఎస్కే డే .. ఇండియా ప్రస్తుతం మూర్ఖుల పరిపాలనలో ఉంది.. వచ్చి చేయగలిగేది ఏం లేదు రాను అని నెహ్రూ ముఖం మీదే అన్నారు. ఏం చేయాలని నెహ్రూ అడిగితే.. సముద్రంపాలయ్యే నీళ్లను ఆనకట్టలు కట్టండి.. వాటిని బంజరు భూములకు మళ్లించండి.. ఆకలితో బాధపడేవారికి అన్నం పెట్టండి.. వ్యవసాయంలో అమెరికా పంపించే మక్క గట్కను ఇండియాలో ప్రజలకు ఉప్మా అని పెడుతున్నారు. ఇండియా అడుక్కుతినే పరిస్థితిలో ఉంది. ఆహార రంగంలో స్వావలంబన సాధించాలి. ఆ దిశగా మీ ఆలోచన ఉంటే మంచిది కదా అని ఎస్కే డే .. నెహ్రూతో అన్నారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి అధికారులతో, ఐఏఎస్ లతో నెహ్రూ చర్చించారు. అందరూ నిజమే అని అంగీకరించి.. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలో మార్పులు చేసి ప్రాజెక్టులు, ఆనకట్టలకు ప్రాధాన్యత పెంచారు” అని కేసీఆర్ చెప్పారు. అలా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టుకుని.. మార్పుల చేస్కుకుంటూ ముందుకు సాగుతుంది. మన చరిత్రను అందరూ తెల్సుకోవాలి. అందరూ పంచవర్ష ప్రణాళికలు స్టడీ చేయాలి. కొత్త మున్సిపల్ చట్టంతోనూ నిర్దిష్ట లక్ష్యాలకోసం పనిచేయాలనుకుంటున్నాం” అన్నారు కేసీఆర్.