
న్యూఢిల్లీ: భారత్– పాక్మధ్య సీజ్‌ఫైర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ చెప్పలేకపోతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపడంలో తాను కీలక పాత్ర పోషించానని ఇప్పటివరకూ ట్రంప్ దాదాపు 30 సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా గంటకు పైగా ప్రసంగించిన మోదీ.. ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. బుధవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.
సీజ్ఫైర్విషయంలో ట్రంప్అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ చెప్పలేరని, అలా చేస్తే ట్రంప్అసలు నిజాలు ఎక్కడ బయటపెడతారోనని మోదీ భయపడుతున్నారని అన్నారు. ‘‘ట్రంప్ అబద్ధం చెబుతున్నారని మోదీ చెప్పలేదు. అక్కడ ఏం జరిగిందో క్లియర్‌గా ఉంది. అయినా.. ట్రంప్అబద్ధం ఆడుతున్నారని చెప్పలేకపోతున్నారు. ట్రంప్ చెప్పేది అబద్ధమని చెబితే.. ఆయనే బహిరంగంగా నిజం చెబుతారు. అందుకే ప్రధాని ఏం చెప్పలేకపోతున్నారు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ట్రేడ్డీల్కోసం భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి వాణిజ్య ఒప్పందం జరుగుతుందో మనమందరం చూస్తున్నామంటూ ఎద్దేవా చేశారు.
మోదీ తీరు అనుమానంగా ఉంది: ఖర్గే
సీజ్‌ఫైర్ విషయంలో ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ తీరు చూస్తుంటే ఏదో అనుమానంగా ఉన్నదని తెలిపారు. చర్చల్లో థర్డ్‌పార్టీ మధ్యవర్తిత్వాన్ని తాము ఎప్పుడూ అంగీకరించలేదని, అది ఇప్పటికీ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ‘‘మరి దీనిని వారు ఎందుకు అంగీకరించారు? ఇందుకు గల కారణాలు ఏంటి? అనేది వారు (కేంద్ర సర్కారు) దేశానికి చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
మోదీ తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ట్రంప్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. సీజ్‌ఫైర్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలను ఖండించి, ఆయన భారత ప్రతిష్టను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ చెప్పి ఉండాల్సింది అని ఖర్గే అన్నారు. కాగా, ట్రంప్ అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోదీ లోక్‌సభలో స్పష్టం చేసి ఉండాల్సిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు.