ధరణిపై కొందరు అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు: కేసీఆర్

ధరణిపై కొందరు అడ్డం పొడుగు మాట్లాడుతున్నరు: కేసీఆర్

ధరణి పోర్టల్ పై  కొంతమంది అడ్డం పొడుగు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు.  ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని..గతంలో పట్టించుకోని వారు ధరణిని తీసేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. ధరణి  ఉండాలా? వద్దా మీరే చెప్పాలంటూ కేసీఆర్  సభకు వచ్చిన ప్రజలను  అడిగారు. ఎక్కడికెళ్లినా  ధరణి ఉండాలని ప్రజలు చెబుతున్నారన్నారు.  ధరణి ఉంది కాబట్టే రాబంధులు, పైరవీ కారులు లేరన్నారు. 

గద్వాల జిల్లాలో ప్రతి గ్రామానికి 10 లక్షల అభివృద్ది నిధులు రిలీజ్ చేస్తామన్నారు.  గద్వాల మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు..మిగతా మూడు  మున్సిపాలిటీలకురూ. 25 కోట్ల చొప్పున కేటాయిస్తామన్నారు. పరిపాలన సంస్కరణల భాగంగానే గద్వాల జిల్లాను ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. 

అప్పటి గద్వాల, ఇప్పటి గద్వాలకు చాలా తేడా ఉందన్నారు కేసీఆర్.  దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నారు.   దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు. ఎంతో ఎత్తున ఉన్న రాష్ట్రాలను కూడా  తెలంగాణ అధిగమించిందన్నారు.