ప్రగతిభవన్ నల్లపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు

V6 Velugu Posted on Oct 15, 2021

హైదరాబాద్: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయం లో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమం లో సీఎం కేసిఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tagged Hyderabad, Telangana, CM KCR, KCR, Dussehra, Pragati Bhavan, vijayadashami, Nallapochamma Temple

Latest Videos

Subscribe Now

More News